
ముగ్గురు యువకులను కాపాడిన లైఫ్‌గార్డ్స్
కాపాడిన యువకులతో లైఫ్‌గార్డ్స్
కొమ్మాది: ప్రముఖ పర్యాటక ప్రాంతం రుషికొండ బీచ్‌లో ముగ్గురు యువకులు కొట్టుకుని పోతుండగా లైఫ్‌గార్డ్స్ ప్రాణాలు కాపాడిన సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌కు చెందిన ఐదుగురు యువకులు శనివారం సాయంత్రం రుషికొండ బీచ్‌కు వచ్చారు. కాసేపు సరదాగా గడిపిన అనంతరం స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగారు. అలల ఉధృతి ఎక్కువగా ఉండటంతో వీరిలో బి.శ్రీనివాసరావు, ఎం.రామ్, ఎ.శివ కొట్టుకుని పోతుండటంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న లైఫ్‌గార్డ్స్ ఎస్.నూకరాజు, ఎం.అమ్మోరు చిన్నప్పన్న, గురుమూర్తి, జి.దేవ గుర్తించారు. వారిని రక్షించి, తీరానికి తీసుకువచ్చారు. వారికి మైరెన్ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. లైఫ్‌గార్డ్స్ ను మైరెన్ సీఐ శ్రీనివాసరావు అభినందించారు.