మోడల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌లు ఎంతో ఉపయోగకరం | - | Sakshi
Sakshi News home page

మోడల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌లు ఎంతో ఉపయోగకరం

May 28 2025 11:38 AM | Updated on May 28 2025 11:38 AM

మోడల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌లు ఎంతో ఉపయోగకరం

మోడల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌లు ఎంతో ఉపయోగకరం

విశాఖ విద్య: పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు మోడల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌లు ఎంతో ఉపయోగకరమని విద్యాశాఖ ఆర్జేడీ బీ. విజయ భాస్కర్‌ అన్నారు. పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో జూన్‌ 1న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న మోడల్‌ డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన కరపత్రాలను డీఈవో ప్రేమ్‌కుమార్‌తో కలిసి ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మెగా డీఎస్సీకి సిద్ధమయ్యే అభ్యర్థులందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎటువంటి ఒత్తిడి లేకుండా పోటీ పరీక్షలను ఎదుర్కొనేందుకు ఇలాంటి మోడల్‌ టెస్ట్‌లు ఉపయోగపడతాయని డీఈవో ప్రేమ్‌ కుమార్‌ తెలిపారు. గోపాలపట్నం జెడ్పీహెచ్‌ఎస్‌, అనకాపల్లి ఎంజీహెచ్‌ఎస్‌, నర్సీపట్నం జెడ్పీహెచ్‌ఎస్‌, అలాగే పాడేరులో మోడల్‌ పరీక్షల కోసం కేంద్రాలు ఏర్పాటు చేశామని పీఆర్‌టీయూ అనకాపల్లి, విశాఖ జిల్లాల అధ్యక్షులు డి. గోపీనాథ్‌, ఎం. శ్రీను తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement