
చల్లని తల్లి మోదకొండమ్మ
సాక్షి,పాడేరు: ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్యదైవం, గిరిజనుల ఇలవేల్పు పాడేరులోని మోదకొండమ్మతల్లి ఉత్సవాలు ఈనెల 11వతేదీ నుంచి 13వతేదీ వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో కమిటీల ప్రతినిధులు శ్రమించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. కలెక్టర్ దినేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ అభిషేక్‌గౌడ అధ్యక్షతన అన్నిశాఖల అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
● అమ్మవారి ఉత్సవాల సందర్భంగా పాడేరు పట్టణమంతా విద్యుత్ దీపాలతో అలంకరించారు. అన్ని రోడ్లను కలుపుకొని ఐదు కిలోమీటర్ల వరకు ఇరువైపులా లైటింగ్ ఏర్పాటుచేశారు. ప్రధాన జంక్షన్లలో దేవతా మూర్తుల విద్యుత్ దీపాల కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
● మోదకొండమ్మతల్లి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. మోదకొండమ్మతల్లి మూలవిరాట్ విగ్రహాన్ని బంగారు అభరణాలతో అలంకరించారు. రూ.2లక్షల వ్యయంతో పూల అలంకరణ చేపట్టారు. మెయిన్‌రోడ్డులోని సతకంపట్టు వద్ద మండపాన్ని అందంగా తీర్చిదిద్దారు.
● ఆదివారం ఉదయం 5గంటలకు అమ్మవారి ఆలయంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ఇతర అధికారులు తొలిపూజలు చేస్తారు. అమ్మవారి ఉత్సవ విగ్రహం, పాదాలు, ఇత్తడి ఘటాలను ఆలయం నుంచి తోడ్కోని మెయిన్‌రోడ్డు వరకు ఉరేగిస్తారు. ఘటాలను నెత్తిన పెట్టుకుని భక్తిశ్రద్ధలతో సతకంపట్టు వరకు మోయడం ఉత్సవాల ప్రారంభంలో ప్రధాన ఘట్టం. అమ్మవారి పాదాలు, ఇత్తడి ఘటాలను గుడివాడ మహిళలు శనివారం శుద్ధి చేశారు.
● ఉత్సవాల సందర్భంగా ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు,ఇతర సిబ్బంది మొత్తం వెయ్యి మందితో ఎస్పీ అమిత్ బర్దర్ బందోబస్తు ఏర్పాటుచేశారు. బందోబస్తుకు సంబంధించి పోలీసు అధికారులు, సిబ్బందితో ఏఎస్పీ అడ్మిన్ ధీరజ్ శనివారం సాయంత్రం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటుచేశారు.
ఘనంగా ఏర్పాట్లు: జేసీ అభిషేక్ గౌడ
మోదకొండమ్మతల్లి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసిందని జాయింట్ కలెక్టర్, ఇన్‌చార్జి ఐటీడీఏ పీవో డాక్టర్ అభిషేక్‌గౌడ తెలిపారు. శనివారం సాయంత్రం స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ప్రైవేట్ సంస్థలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ఆయన పరిశీలించారు. జెయింట్ వీల్, ఇతర వినోద కార్యక్రమాలకు సంబంధించి భద్రతా చర్యలను అఽధికారులతో సమీక్షించారు. అలాగే మోదకొండమ్మతల్లి ఆలయం, మెయిన్‌రోడ్డులోని సతకంపట్టు వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. సబ్‌కలెక్టర్ సౌర్యమన్‌పటేల్, ఆర్‌అండ్‌బీ ఈఈ బాలసుందరబాబు, డీఎల్పీవో కుమార్ పాల్గొన్నారు.
బందోబస్తుపై ఎస్పీ సమీక్ష
ఉత్సవాల మూడు రోజులు పాడేరు పట్టణంలో పోలీసుశాఖ ఏర్పాటు చేసిన భారీ బందోబస్తు, ఇతర తనిఖీలు, సీసీ,డ్రోన్ కెమెరాల నిఘాపైె ఎస్పీ అమిత్‌బర్దర్ ఽశనివారం సమీక్షించారు. మోదకొండమ్మతల్లి ఆలయం, శతకంపట్టు ప్రాంతాలను ఆయన సందర్శించారు. భద్రత ఏర్పాట్ల వివరాలను ఏఎస్పీ (అడ్మిన్) ధీరజ్ తదితర అధికారుల నుంచి తెలుసుకున్నారు.
నేటి నుంచి పాడేరులో ఉత్సవాలు
పట్టణమంతా విద్యుత్ దీపాలతో
అలంకరణ
ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు

చల్లని తల్లి మోదకొండమ్మ

చల్లని తల్లి మోదకొండమ్మ