
విప్లవ జ్యోతి అల్లూరికి ఘన నివాళి
అనకాపల్లి: విప్లవ వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి జిల్లా అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహన్‌రావు బుధవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం సాయుధ పోరాటమే మార్గమని నమ్మిన అల్లూరి బ్రిటిష్ సైన్యాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారన్నారు. గిరిజనుల హక్కుల కోసం పోరాడి, వారికి చైతన్యం కలిగించిన మహానుభావుడు అల్లూరి అని కొనియాడారు. 1924 మే 7న బ్రిటిష్ తుపాకులకు బలైపోయినా, ఆయన త్యాగం, ధైర్యం, దేశభక్తి చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మోహనరావు, సీఐలు లక్ష్మణమూర్తి, బాల సూర్యారావు, తమలంపూడి లక్ష్మి, రమేష్, గఫూర్, ఎస్‌ఐ ప్రసాద్, శిరీష, అంజిబాబు, విశ్వనాథం, మదీనా వల్లి, తదితరులు పాల్గొన్నారు.