
కాంగ్రెస్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం
నూతనంగా ఎన్నికై న జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం
అనకాపల్లి టౌన్ : పట్టణంలోని న్యూకాలనీ రోటరీ హాల్‌లో జిల్లా, అనకాపల్లి పట్టణ, మండల కాంగ్రెస్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మీసాల సుబ్బన్న నూతనంగా ఎన్నికై న సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే వాళ్లకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయం అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకలు పి.ఎస్ దత్తు, జిల్లా అసెంబ్లీ కో ఆర్డినేటర్లు ఎం.కోటేశ్వరావు, టి.అనంతరావు, ఎం. చక్రవర్తి పాల్గొన్నారు.