అజెండా! | - | Sakshi
Sakshi News home page

అజెండా!

Jul 8 2026 12:56 AM | Updated on Jul 8 2026 12:56 AM

సంక్షేమమే
ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనుల కష్టాలను స్వయంగా చూసి, వారి అభివృద్ధిని తన పాలనలో ప్రధాన ఎజెండాగా పెట్టుకున్న నాయకుడు దివంగత సీఎం రాజశేఖరరెడ్డి. కేవలం పథకాలకే పరిమితం కాకుండా, గిరిజనుల జీవన ప్రమాణాలను మార్చేందుకు ఆయన ప్రవేశపెట్టిన అటవీ హక్కుల చట్టం, ఆరోగ్యశ్రీ, కాఫీ ప్రాజెక్టులు నేటికీ మన్యంలో ఆయనకు ఒక దైవత్వాన్ని ఆపాదిస్తున్నాయి. మహానేత మరణించి దశాబ్ద కాలం దాటినా, ఆనాడు ఆయన నాటిన అభివృద్ధి ఫలాలు నేటికీ గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతూనే ఉన్నాయి. ఆయనతో తమకున్న ఆత్మీయ బంధాన్ని, ఆయన కల్పించిన సౌకర్యాలను గిరిజన రైతులు, సామాన్యులు నేటికీ ఎంతో కృతజ్ఞతతో నెమరువేసుకుంటున్నారు.

ఎంతో మేలు చేశారు

కొండపోడు భూమిలో కాఫీ మొక్కలు వేసుకున్నాం. సాగు భూమికి హక్కులు లేకపోవడంతో అటవీశాఖ ద్వారా అప్పట్లో ఇబ్బందులు పడేవాళ్లం. వైఎస్‌ సీఎం అయిన తరువాత అటవీ హక్కుల చట్టం ద్వారా తమ కాఫీతోటలకు పట్టాలు ఇచ్చారు. అలాగే మరో రెండు ఎకరాల్లో కాఫీతోటను విస్తరించేందుకు ఐటీడీఏ చర్యలు తీసుకుంది. అదనపు కాఫీతోటతో మహానేత ఎంతో మేలు చేశారు.

– కూడా నాగేశ్వరరావు, కాఫీ రైతు, కరకపుట్టు, పాడేరు మండలం

మోడల్‌ కాలనీతోపక్కా గృహాలు

మహానేత డాక్టర్‌ వైఎస్సార్‌ మా గ్రామంలో అన్ని కుటుంబాలకు ఎంతో మేలు చేశారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు మాతో పాటు అనేక గ్రామాలకు పక్కా గృహాలతో మోడల్‌ కాలనీ నిర్మించి సొంత గూడు కల్పించారు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు తాగునీరు, సీసీ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు. ఆయన చేసిన మేలు ఎన్నటికీ మరువలేం.

– బారికి ఎల్లాజీ, పాడేరు

సాక్షి, పాడేరు: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి గిరిజనుల హృదయాల్లో దైవంగా కొలువై ఉన్నారు. ఆయన మరణించినప్పటికీ, తన హయాంలో చేపట్టిన విశేష అభివృద్ధిని గిరిజనులు నేటికీ కృతజ్ఞతతో గుర్తుచేసుకుంటారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో విద్య, వైద్యం సహా అన్ని రంగాల్లో మన్యం అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారు.

అనుసంధానానికి ప్రత్యేక చొరవ

మారుమూల గ్రామాలకు రోడ్ల అనుసంధానం కోసం ప్రత్యేక చొరవ చూపారు. ఉపాధి హామీ పథకం ద్వారా మట్టి రోడ్లను, గిరిజన సంక్షేమ మరియు పంచాయతీరాజ్‌ శాఖల నిధులతో తారు రోడ్లను నిర్మించారు. 2009 పునర్విభజనలో చింతపల్లి నియోజకవర్గం రద్దయి పాడేరులో విలీనమైంది. అరకు, చింతపల్లి, పాడేరు ప్రాంతాలను వైఎస్సార్‌ సమానంగా అభివృద్ధి చేశారు.

రూ.150 కోట్లతో రోడ్ల అభివృద్ధి

సుమారు రూ.150 కోట్లతో మారుమూల గ్రామాలకు రోడ్లను నిర్మించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం నుంచి వందల కోట్ల నిధులను రప్పించిన ఘనత వైఎస్సార్‌దే. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆయన కుమారుడు సీఎం జగన్‌ హయాంలో ఆ మట్టి రోడ్లన్నీ పక్కా రోడ్లుగా రూపాంతరం చెందాయి.

అటవీ భూములకు హక్కు పత్రాలు

అటవీ హక్కుల చట్టం ద్వారా గిరిజనులకు భూమిపై సర్వ హక్కులను కల్పించారు. 2009 జూలై 13న పాడేరులో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి హోదాలో మొదటి విడతగా 20 వేల ఎకరాల అటవీ భూములకు పట్టాలు పంపిణీ చేశారు. ఆ తర్వాత మరో 60 వేల ఎకరాలకు హక్కు పత్రాలు అందజేశారు.

గిరిజనులకు ఆరోగ్యశ్రీ వరం

కార్పొరేట్‌ వైద్యమంటే తెలియని గిరిజనులకు ఆయన ప్రవేశపెట్టిన ’ఆరోగ్యశ్రీ’ పథకం వరంలా మారింది. వేలాది మంది గిరిజన కుటుంబాలు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఉన్నత వైద్య సేవలు పొందాయి. పాడేరు, చింతపల్లి ఆస్పత్రుల బలోపేతంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆధునీకరించారు. గిరిజన రైతులకు 90 శాతం సబ్సిడీపై వ్యవసాయ విత్తనాలను ఐటీడీఏ ద్వారా పంపిణీ చేశారు. విద్య, వైద్యం, తాగునీరు, సాగునీటి రంగాల్లో ఆయన చేసిన అద్భుతమైన కృషి, రాజకీయాలకు అతీతంగా గిరిజనుల గుండెల్లో ఆయనను చిరస్థాయిగా నిలిపాయి.

గిరిజనుల జీవన ప్రమాణాల్లోమార్పునకు కృషి

అటవీ హక్కుల చట్టంతోఎంతోమందికి భరోసా

నాటి అభివృద్ధి ఫలాలుగిరిజనుల జీవితాల్లో వెలుగులు

మన్యం అభివృద్ధిలోదివంగత వైఎస్‌ది తనదైన ముద్ర

నేడు ఆయన జయంతి

రూ.349 కోట్లతో కాఫీ ప్రాజెక్టు

గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా లక్ష ఎకరాల్లో కాఫీ తోటల విస్తరణకు రూ.349 కోట్లతో మహోన్నత కాఫీ ప్రాజెక్టును ఆయన అమలు చేశారు. 2009 నుంచి 2016 మధ్య విస్తరించిన ఈ తోటలు నేడు గిరిజనులకు ఏటా లక్ష రూపాయల వరకు ఆదాయాన్ని అందిస్తున్నాయి.

ఆరోగ్యశ్రీతోగుండె ఆపరేషన్‌

మహానేత డాక్టర్‌ వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం నాకు పునరజన్మనిచ్చింది.గుండె సంబంధిత వ్యాధితో అప్పట్లో బాధపడేదానిని. మా తల్లిదండ్రులు పేదరికం కావడంతో పెద్దాసుపత్రులకు తీసుకు వెళ్లే స్థోమత లేదు.ఆ సమయంలో ఆరోగ్యశ్రీ ద్వారా విశాఖలోని సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రిలో చేర్చారు.గుండెకు అపరేషన్‌ జరపడంతో ప్రాణాపాయం తప్పింది.సుమారు రూ.2లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఖర్చుపెట్టారు.నేను ఆరోగ్యంగానే జీవిస్తున్నా.

– వెచ్చంగి రాములమ్మ, గిరిజన మహిళ,

పరదానిపుట్టు, పెదబయలు మండలం

60 వేల కుటుంబాలకుపక్కా ఇళ్లు

ఇందిరమ్మ పథకం ద్వారా ఏజెన్సీలోని 11 మండలాల్లో 60 వేల కుటుంబాలకు పక్కా గృహాలను మంజూరు చేసిన ఘనత ఆయనకే దక్కింది. గుడిసెల్లో దుర్భర జీవనం గడిపే గిరిజనులకు సొంత గూడు కల్పించారు. అరకులోయ మండలంలోని కోడిపుంజువలస వరద బాధితుల కోసం యుద్ధప్రాతిపదికన మోడల్‌ కాలనీని నిర్మించి ఆదుకున్నారు. ఇవే తరహాలో అనేక మోడల్‌ కాలనీలను నిర్మించి గిరిజనులకు ఎంతో మేలు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement