మహా వృక్షం.. మహానేత జ్ఞాపకం! | - | Sakshi
Sakshi News home page

మహా వృక్షం.. మహానేత జ్ఞాపకం!

Jul 8 2026 12:56 AM | Updated on Jul 8 2026 12:56 AM

పాడేరులో నేటికీ పదిలంగా కదంబ వృక్షం

సాక్షి, పాడేరు: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆనాడు నాటిన మొక్క నేడు మహా వృక్షంగా ఎదిగి ఆయన జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. అటవీ హక్కు చట్టం అమలులో భాగంగా, గిరిజన రైతుల సాగు భూములకు పట్టాలు పంపిణీ చేసేందుకు 2009 జూలై 12న ముఖ్యమంత్రి హోదాలో పాడేరు వచ్చిన డాక్టర్‌ వైఎస్సార్‌, తలారిసింగి పాలిటెక్నిక్‌ కళాశాల ప్రాంగణంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఒక కదంబ మొక్కను నాటారు. కాలగమనంలో ఆ మొక్క నేడు మహావృక్షంగా ఎదిగి కళాశాల ప్రాంగణంలో చిరస్మరణీయంగా నిలిచింది. మహానేత భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ, ఆయన నాటిన ఈ కదంబ వృక్షాన్ని స్థానికులు ఆయనకు గుర్తుగా భావిస్తూ ఎంతో పదిలంగా చూసుకుంటున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement