రాజీ మార్గంతోనే కేసులకు శాశ్వత పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

రాజీ మార్గంతోనే కేసులకు శాశ్వత పరిష్కారం

Jul 8 2026 12:56 AM | Updated on Jul 8 2026 12:56 AM

పాడేరు: రాజీ మార్గమే అత్యంత ఉత్తమమైన విధానమని, ఏళ్ల తరబడి కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను ఇరువర్గాలు పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలని పాడేరు ఫస్ట్‌క్లాస్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు న్యాయమూర్తి ఎ.రాము సూచించారు. మంగళవారం కోర్టు ప్రాంగణంలో కోర్టు పరిధిలోని ఐదు మండలాల సీఐలు, ఎస్‌ఐలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ, ఈ నెల 11న అన్ని కోర్టుల్లో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను ఇరువర్గాలు చర్చల ద్వారా రాజీ మార్గంలో పరిష్కరించుకోవచ్చని, ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పాడేరు సీఐ ఎస్‌.రామారావు, పాడేరు ఎకై ్సజ్‌ సీఐ టి.వి.వి.ఎస్‌.ఎన్‌.అచారి, పాడేరు, జి.మాడుగుల ఎస్‌ఐలు పాపినాయుడు, సాయిరాం పడాల్‌, ఏఎస్‌ఐలు ఎస్‌.వల్లభనాయుడు, జి.మహేష్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ కె.లోకేష్‌, కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

పాడేరు మెజిస్ట్రేట్‌ కోర్టు జడ్జి రాము

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement