● రాజకీయ పార్టీలు సహకరించాలి
● కలెక్టర్ నిశాంతి
సాక్షి,పాడేరు: జిల్లాలో జరుగుతున్న ఓటర్ల సమగ్ర సవరణ కార్యక్రమంలో అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యమని, ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని,కలెక్టర్ టి.నిశాంతి కోరారు.ఓటర్ల జాబితా సవరణకు సంభందించి అన్ని రాజకీయ పార్టీల నేతలతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ల సవరణ ప్రక్రియ చురుగ్గానే జరుగుతుందన్నారు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన బీఎల్‌ఏలు కూడా బీఎల్వోలు, ఇతర ఎన్నికల సిబ్బందికి సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో జేసీ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ ఎస్.దొన్నుదొర, వైఎస్సార్‌సీపీ నేత కటారి చంటి తదితరులు పాల్గొన్నారు.


