● అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
అరకులోయ టౌన్: ఈ నెల 8వ తేదీ, బుధవారం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పిలుపునిచ్చారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అరకులోయలోని నాలుగు రోడ్ల జంక్షన్‌లోని వైఎస్సార్ విగ్రహం వద్ద జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బుధవారం ఉదయం జరిగే ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, పంచాయతీ, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయంతిని విజయవంతం చేయాలని కోరారు.


