జడ శ్రావణ్ కుమార్‌పై కొత్తకోట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న జనసేన ఇన్‌చార్జ్ రాజు
రావికమతం : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన లాయర్ జడ శ్రావణ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని మంగళవారం కొత్తకోట పోలీసులకు చోడవరం నియోజవర్గ జనసేన ఇన్‌చార్జి పి.వి.ఎస్.ఎన్ రాజు, జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ బద్దమైన ప్రజల చేత ఎన్నుకోబడిన పదవిలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఆపహాస్యం చేయడమే అని అన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన లాయర్ జడా శ్రావణ్‌కుమార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


