వివాహిత ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Jul 8 2026 12:56 AM | Updated on Jul 8 2026 12:56 AM

మునగపాక/అనకాపల్లి: కుటుంబ కలహాల కారణంగా వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలిలా ఉన్నాయి. చూచుకొండకు చెందిన కోరిబిల్లి చరణ్‌ కిరాణా షాపు నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నారు. అతని భార్య అనూషా అనకాపల్లిలోని ప్రైవేటు మెడికల్‌ ల్యాబ్‌లో ల్యాబ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూ కుటుంబానికి చేదోడువాదోదుగా ఉంటుంది. కొంత కాలంగా భార్యాభర్తల నడుమ కలహాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అనూష మంగళవారం అనకాపల్లి శారదానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.మృతురాలికి గతంలో వివాహం జరిగింది. మొదటి భర్త అనారోగ్య కారణంగా మృతిచెందడంతో, రెండో వివాహం చేసుకుంది. మృతురాలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న భర్త చరణ్‌, ఇద్దరు పిల్లలు విలపించారు. అనూష ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని స్థానికులు తట్టుకోలేకపోతున్నారు. ఇద్దరు పిల్లలను ఆనాథలుగా చేసి తల్లి అసువులుబాయడంతో కన్నీటి పర్వంతమయ్యారు. ఈ ఘటనతో చూచుకొండలో విషాదం అలముకుంది. అనుషా తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అనకాపల్లి పట్టణ ఎస్‌ఐ శ్రీనివాసరావు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement