అనంతగిరి, (అరకులోయ టౌన్): మండలంలో ఓటరు నమోదు ప్రక్రియ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని పాడేరు ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ ఆదేశించారు. మంగళవారం ఆయన 284, 285 పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఓటర్ల నమోదు ప్రక్రియను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. పోలింగ్ కేంద్రం 284లో 1118 ఓటర్లు ఉండగా 608 మంది ఓటర్ల డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. 285 పోలింగ్ కేంద్రంలో 622 మంది ఓటర్లకు 363 మంది డిజిటలైజేషన్ పూర్తయిందన్నారు. వీటిని ఈనెల పదో తేదీ లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. తహసీల్దార్ ఎం. వీరభద్రాచారి, బూత్ స్థాయి అధికారులు కుసుమ, దేముడు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


