నాతవరం: అనుమతులు లేకుండా అక్రమంగా తవ్వకాలు జరిపి గ్రావెల్ తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను మండలంలోని వల్సంపేట జంక్షన్‌లో మంగళవారం తహసీల్దార్ ఓ.చందనరేఖ పట్టుకున్నారు. వాటిని నాతవరం కార్యాలయానికి తరలించి జరిమానా విధించారు. ఈసందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ గ్రావెల్ తవ్వకాలు అక్రమంగా జరిపితే కఠిన చర్యలు తప్పవన్నారు. చెరువులో మట్టి తవ్వకాలు కూడా ఇరిగేషన్ శాఖ అధికారుల నుంచి అనుమతులు ఉండాలని, వారిని చెప్పిన విధంగా నిబంధనలకు లోబడి తవ్వకాలు జరపాలని తెలిపారు. చమ్మచింత, గుమ్మడిగొండ, చిక్కుడుపాలెం వద్ద తాండవ నదిలో ప్రభుత్వ నిబంధనలు అనుసరించి ఇసుక తవ్వకాలు చేసుకోవాలన్నారు. చిక్కుడుపాలెం వద్ద తాండవ నదీలో తాగునీటి పథకం పైలట్ ప్రాజెక్టు ఉందని దానికి దూరంగా తవ్వకాలు జరపాలన్నారు.


