హెచ్‌సీ ధనరాజ్‌కు ఫిర్యాదు చేస్తున్న రైతులు
మునగపాక: గత కొద్ది రోజులుగా విద్యుత్ మోటార్ల వైర్లు చోరీ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం హెచ్‌సీ ధనరాజ్‌కు ఫిర్యాదు చేశారు. స్థానిక మెయిన్‌రోడ్డులోని హరేరామ బిల్డింగ్ దరి ఆడారి సాంబశివరావు మోటార్‌కు చెందిన వైర్లు సోమవారం రాత్రి చోరీకి గురయ్యాయి. దీంతో రైతు సంఘం అధ్యక్షుడు ఆడారి మహేష్‌తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎస్.బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు.


