మాదిగల సమస్యల పరిష్కారానికి
ఎస్సీ కాలనీలో ఎంఆర్‌పీఎస్ జెండా ఆవిష్కరణలో పాల్గొన్న నాయకులు సుబ్బారావు, బుచ్చిబాబుఎంపీటీసీ జయలక్ష్మి
పాత బస్టాండ్‌లో అంబేడ్కర్ విగ్రహానికి నివాలర్పిస్తున్న ఎంఆర్‌పీఎస్ నాయకులు చిన సుబ్బారావు,బుచ్చిబాబు తదితరులు
చింతపల్లి: ఏజెన్సీ ప్రాంతంలో మాదిగలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని ఎంఆర్‌పీఎస్ జాతీయ పొలిట్‌బ్యూరో సభ్యుడు ముమ్మిడివరపు చిన సుబ్బారావు స్పష్టం చేశారు. మంగళవారం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినోత్సవాన్ని చింతపల్లిలో ఎంఎస్పీ అల్లూరి జిల్లా అధ్యక్షుడు మోర్తా బుచ్చిబాబు మాదిగ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక హనుమాన్ జంక్షన్ నుంచి పాత బస్టాండు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎస్సీ కాలనీలో ’మందకృష్ణ మాదిగ నాయకత్వం వర్థిల్లాలి అంటూ నూతనంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సుబ్బారావు మాట్లాడుతూ.. అల్లూరి జిల్లాలో మాదిగలు ఎంతో వెనుకబాటుతనంతో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారానికి మాదిగలంతా ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజన చట్టాలకు, హక్కులకు ఎటువంటి భంగం వాటిల్లకుండా, మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లి హక్కులను సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్ అరకు పార్లమెంట్ అధ్యక్షులు కుందూరు రాజు, మహిళా నాయకురాలు, ఎంపీటీసీ చిందాడ జయలక్ష్మి, చింతపల్లి మండల అధ్యక్షులు పెదపూడి నాగేశ్వరరావు, కార్యదర్శి చిన అప్పారావు, నాయకులు వెంకట్రావు, అప్పారావు, నూకేశ్వరరావు, సలికి లక్ష్మి, సాయి లక్ష్మి, సోమరాజు తదితరులు పాల్గొన్నారు.
ఎంఆర్‌పీఎస్ నేత సుబ్బారావు


