కోలాహలం | - | Sakshi
Sakshi News home page

కోలాహలం

Jul 7 2026 1:19 AM | Updated on Jul 7 2026 1:19 AM

పొలాల్లో

జిల్లాలో ఎటు చూసినా వ్యవసాయ పనులతో

పొలాలు కళకళలాడుతున్నాయి. ఈ ఏడాది

వర్షాలు ఆశాజనకంగా ఉండడంతో గిరిజన

రైతులు ఖరీఫ్‌ వరి సాగు పనుల్లో నిమగ్న

మయ్యారు. పలువురు అన్నదాతలు నారు

మడులకు సిద్ధం చేసుకుంటుండగా, మరి

కొంతమంది నాట్లు వేస్తున్నారు. ఏజెన్సీలోని

గిరిజన రైతులంతా ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నారు.

సాక్షి, పాడేరు: కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో జిల్లాలోని 11 మండలాల్లో ఖరీఫ్‌ పనులు జోరందుకున్నాయి. పొలాలు కోలాహలంగా మా రాయి. ఏరువాక పనుల్లో గిరిజనులు నిమగ్నమయ్యారు. ఐదు రోజుల నుంచి విస్తారంగా కురుస్తున్న వర్షాలు వ్యవసాయానికి ఎంతో మేలు చేశాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవగా, కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. వర్షాలు కురుస్తుండడంతో గిరిజన రైతులు పొలంపనులు చేపట్టారు. రెండవ దుక్కులు, నీటి నిల్వలు అధికంగా ఉన్న వ్యవసాయ భూముల్లో దమ్ము పనులు, ఆశాజనకంగా ఎదిగిన వరినారు తీత, వెనువెంటనే వరినాట్ల వేయడం తదితర పనులు జోరుగా సాగుతున్నాయి.

42వేల హెక్టార్లలో ఖరీఫ్‌ వ్యవసాయం

జిల్లాలో ఖరీఫ్‌లో ప్రతి ఏడాది 42వేల హెక్టార్లలో వరి సాగుచేస్తారు. 20వేల క్వింటాళ్ల వరకు వరి విత్తనాలు అవసరమవుతాయి.అయితే ప్రభుత్వం 9,800 క్వింటాళ్ల విత్తనాలను 90శాతం సబ్సిడీపై ఆలస్యంగా అందుబాటులోకి తెచ్చింది. అప్పటికే పలువురు గిరిజన రైతులు వారపు సంతలు, ఒడిశాలో హైబ్రిడ్‌ రకం వరి విత్తనాలను కొనుగోలు చేసి నారుమడులు వేసుకున్నారు.ఆ తర్వాత వ్యవసాయశాఖ పంపిణీ చేసిన విత్తనాలను పలువురు రైతులు పొందారు. జూన్‌ నెలలో ఆశించినంత వర్షాలు కురవక పోవడంతో అన్నదాతలు ఆందోళన చెందారు.ఈ వారంలో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడంతో నారుమడుల ఎదుగుదలకు ఎంతో మేలు చేసింది.

జిల్లాలో జోరందుకున్న ఖరీఫ్‌ పనులు పలు చోట్ల నారుమడులు సిద్ధం... మరికొన్ని చోట్ల వరి నాట్లు ప్రారంభం

వాతావరణం అనుకూలం

ఖరీఫ్‌ వ్యవసాయ పనులకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. వర్షాలు కురుస్తుండడంతో వరినాట్లు పడుతున్నాయి. వ్యవసాయశాఖ ద్వారా సబ్సిడీపై పొందిన 9,800 క్వింటాళ్ల విత్తనాలతో వేసిన నారుమడులు కూడా ఆశాజనకంగా ఎదుగుతున్నాయి.రైతులంతా గ్రామ సచివాలయాల పరిధిలో వ్యవసాయ అసిస్టెంట్ల సలహాలు,సూచనలు పాటించి అధిక దిగుబడుల లక్ష్యంగా వ్యవసాయం చేయాలి

–ఎస్‌.బి.ఎస్‌.నందు, జిల్లా వ్యవసాయాఽధికారి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement