ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
డుంబ్రిగుడ: ‘సర్’ సర్వే వేగవంతం చేయాలని, అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సచివాలయం ఉద్యోగులను హెచ్చరించారు. మండలంలోని అరకు, కొర్రాయి, కొల్లపుట్టు, గసభ, సొవ్వ సచివాలయాలతో పాటు సొవ్వ ఆశ్రమ పాఠశాలను ఆయన సందర్శించారు. ఈసందర్భంగా మండలంలో నిర్వహిస్తున్న ‘సర్ ’, బీఎల్‌వోల పనితీరు, కొత్త ఓటర్ల నమోదు, వలస ఓటర్లు వివరాలను సచివాలయం సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఎల్‌వోలు నిర్లక్ష్యం వహించకుండా ఇంటింటికీ వెళ్లి సర్వే చేయాలని ఆదేశించారు. సొవ్వ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పాంగి పరశురామ్, వైస్ ఎంపీపీ శెట్టి ఆనంద్‌రావు, రామ్‌ప్రసాద్, అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


