ఆధునిక సాంకేతికతను యువత అందిపుచ్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఆధునిక సాంకేతికతను యువత అందిపుచ్చుకోవాలి

Jul 7 2026 1:19 AM | Updated on Jul 7 2026 1:19 AM

ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ

పాడేరు: జిల్లాలోని గిరిజన యువత సాంకేతిక రంగంలో కృత్రిమ మేధస్సు, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ అన్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన యువత కోసం ఏఐ ఆరోహణ్‌, ఏఐ డిజిటల్‌ స్కిల్స్‌ ఫెలోషిప్‌ కోర్సును సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశల వారీగా మూడు బ్యాచ్‌లలో ఆరు నెలల కాలానికి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానం ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. సాంకేతిక రంగంలో ఉన్నత సామర్థ్యం కలిగిన గిరిజన యువతను గుర్తించి ప్రోత్సహించడం కోసం శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. అర్హత కలిగిన గిరిజన యువత ఈ అవకాశాలను స ద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, ఏవో హేమలత, గిరిజన యువత పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement