ఈదురు గాలుల బీభత్సం | - | Sakshi
Sakshi News home page

ఈదురు గాలుల బీభత్సం

Jul 7 2026 1:19 AM | Updated on Jul 7 2026 1:19 AM

పెదబయలు: మండలంలోని గలగండ పంచాయతీ గసాబు గ్రామంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఆదివారం అర్ధరాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఈదురు గాలులకు ఓ ఇంటిపై చెట్టు కూలడంతో పైకప్పు ధ్వంసమైంది. ఇంట్లో నిద్రిస్తున్న వారికి ఎటువంటి గాయాలు కాలేదు. సుమారు రూ.30 వేలు నష్టం జరిగినట్టు బాధితుడు పూజారి గణేశ్వరరావు తెలిపారు. వీఆర్వో కొండబాబు సోమవారం ఆ ఇంటిని పరిశీలించారు. ఉన్నతాధికారులకు నివేదించనున్నట్టు ఆయన చెప్పారు.

చెట్టుకూలి ఇంటి పైకప్పు ధ్వంసం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement