ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌కు 38 అర్జీలు | - | Sakshi
Sakshi News home page

ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌కు 38 అర్జీలు

Jul 7 2026 1:19 AM | Updated on Jul 7 2026 1:19 AM

అర్జీదారుల సమస్యను వింటున్న ఎస్పీ తుహిన్‌ సిన్హా

అనకాపల్లి : ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌కు 38 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్‌ సిన్హా ఆర్జీలు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చట్ట పరిధిలో సమస్యలు వారంరోజుల్లో పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. భూ తగాదాలు, ఆస్తి గొడవలు, ఆర్థిక మోసాలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల వేధింపులు, గృహ కలహాలు, శాంతిభద్రతలపై అర్జీలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్‌.మోహన్‌రావు, ఎస్‌ఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement