రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

Jul 7 2026 1:19 AM | Updated on Jul 7 2026 1:19 AM

అనకాపల్లి : స్థానిక రైల్వేస్టేషన్‌ 3వ నంబర్‌ ప్లాట్‌ఫారంలో సుమారుగా 50 సంవత్సరాల వయస్సుగల గుర్తు తెలియని వ్యక్తి స్వర్ణజయంతి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు నుంచి ప్రమాదశాత్తూ జారిపడిపోయి అక్కడిక్కడే మృతిచెందినట్టు దువ్వాడ జీఆర్పీ ఎస్‌ఐ కె.టి.ఆర్‌.లక్ష్మి చెప్పారు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లేవని, బ్లూ, బ్లాక్‌ చెక్స్‌ షర్ట్‌, సిమెంట్‌ రంగు పుల్‌ఫ్యాంట్‌ ధరించి ఉన్నట్టు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించడం జరిగిందన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌నంబర్‌ 7382058996ను సంప్రదించాలన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement