26న రాష్ట్రస్థాయి బాడీ బిల్డింగ్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

26న రాష్ట్రస్థాయి బాడీ బిల్డింగ్‌ పోటీలు

Jul 7 2026 1:19 AM | Updated on Jul 7 2026 1:19 AM

మాట్లాడుతున్న అసోసియేషన్‌ నిర్వాహక సభ్యులు

కంచరపాలెం: గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ నెల 26న ‘మిస్టర్‌ ఆంధ్ర’ రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్‌, యువ స్పోర్ట్స్‌ క్లాసిక్‌ పోటీలను నిర్వహించనున్నట్లు స్టేట్‌ బాడీ బిల్డింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.సుబ్బమ్మ తెలిపారు. కంచరపాలెం ఐటీఐ జంక్షన్‌ వద్ద గల హనుమాన్‌ జిమ్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 200 మంది క్రీడాకారులు తరలిరానున్నట్లు పేర్కొన్నారు. 55 కేజీల నుంచి 90 కేజీల విభాగంలో మెన్స్‌ ఫిజిక్‌, క్లాసిక్‌ ఫిజిక్‌, డిసేబుల్డ్‌ , మహిళా బాడీ బిల్డింగ్‌ ప్రత్యేక గ్రూపులలో ఈ పోటీలు ఉంటాయని వివరించారు. ఈ సమావేశంలో అసోసియేషన్‌ సభ్యులు బి.శ్రీనివాసరావు, ఆర్‌.కుమార్‌, సింహాద్రి, కె.వి.కమలకర్‌, ఎస్‌కే బషీర్‌ ఉద్దీన్‌, ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement