మోదకొండమ్మను దర్శించుకుంటున్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.బి.జోషికి అమ్మవారి మెమెంటో అందజేసి సత్కరిస్తున్న ఆలయ కమిటీ చైర్మన్ అప్పలరాజు, కమిటీ సభ్యులు
మాడుగుల : మాడుగుల మోదకొండమ్మను కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.బి.జోషి సోమవారం దర్శించుకున్నారు. దీంతో ఆలయ కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజుతో పాటు ఇతర కమిటీ సభ్యులు జోషికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి అమ్మవారి మెమెంటో అందజేసి ఘనంగా సత్కరించారు.ఆలయ కమిటీ సభ్యులు దేవరాపల్లి శ్రీనివాసరావు, దంగేటి సూర్యారావు, తహసీల్దార్ రమాదేవి, స్థానిక నాయకులు పుప్పాల లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు.


