జాతీయ రహదారిపై వ్యాన్‌ దగ్ధం | - | Sakshi
Sakshi News home page

జాతీయ రహదారిపై వ్యాన్‌ దగ్ధం

Jul 6 2026 12:52 AM | Updated on Jul 6 2026 12:52 AM

కశింకోట: కశింకోట వద్ద జాతీయ రహదారిపై షార్టు సర్క్యూట్‌ కారణంగా వ్యాన్‌ దగ్దమైంది. సుమారు రూ.8 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అంచనా. విజయనగరం నుంచి విజయవాడ వైపు వెళుతున్న ప్రైవేటు మార్టుకు చెందిన వ్యాన్‌ ఇక్కడి కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్దకు చేరే సరికి ఒక్కసారిగా మంటలు వ్యాపించి కాలిపోసాగింది. ఈ విషయాన్ని గమనించిన మరో వాహన చోదకుడు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన వ్యాన్‌ను డ్రైవర్‌ పక్కకు నిలిపాడు. దీంతో మంటలు పెద్దవయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది శకటంతో వచ్చి మంటలను అదుపు చేశారు. ఇందుకు స్థానికులు సహకారం అందించారు. ఇంజిన్‌లో ఏర్పడిన షార్టు సర్క్యూట్‌ కారణంగా మంటలు ఏర్పడి ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement