హెచ్‌డబ్ల్యూవోలజిల్లా కార్యవర్గ ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

హెచ్‌డబ్ల్యూవోలజిల్లా కార్యవర్గ ఎన్నిక

Jul 6 2026 12:46 AM | Updated on Jul 6 2026 12:46 AM

పాడేరు రూరల్‌: హెచ్‌డబ్ల్యూవోల జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక ఆదివారం పాడేరులో ప్రశాంతంగా జరిగింది. ఈ ఎన్నికల్లో భాగంగా నూతన కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా జె. జగత్‌రాయ్‌ (పెదబయలు), ప్రధాన కార్యదర్శిగా వై.కుంఠరావు (డుంబ్రిగుడ), ఉపాధ్యక్షుడు: తిరుపతిరావు (బాకూరు), కార్యదర్శి: పాంగి చిట్టిబాబు (లోచలిపుట్టు, పాడేరు), కోశాధికారి: సీహెచ్‌. కాళీదాస్‌ (పాడేరు) వీరితో పాటు మరో 10 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నట్లు నూతన అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు.

సమస్యల పరిష్కారమే లక్ష్యం

ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సహోద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తామని, సంఘం బలోపేతానికి చిత్తశుద్ధితో పనిచేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement