పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ

Jul 6 2026 12:46 AM | Updated on Jul 6 2026 12:46 AM

అరకులోయ టౌన్‌: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్బీ. జోషి అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన అరకులోయ మండలంలోని మాడగడ పంచాయతీ పరిధిలో ఉన్న పలు పోలింగ్‌ స్టేషన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ

సవరణ కార్యక్రమం నిర్వహణపై అధికారులతో సమీక్షించిన ఆయన, నేరుగా ఇంటింటికీ వెళ్లి వివరాలను ఆరా తీశారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకున్న అనంతరం పలు కీలక సూచనలు చేశారు. పోలింగ్‌ కేంద్రాల సందర్శన సందర్భంగా, ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ, వివరాల డిజిటలైజేషన్‌ ప్రక్రియపై బీఎల్వోలను అడిగి తెలుసుకున్నారు.

నిర్లక్ష్యం వహించకూడదు

ఈ సందర్భంగా ఎస్‌బీ జోషి మాట్లాడుతూ.. సవరణ కార్యక్రమాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలను సేకరించి, నమోదు చేయాలని, ఈ ప్రక్రియలో ఎటువంటి లోపాలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ రాజశ్రీధర్‌, ఎంపీడీవో వీసం ప్రసాద్‌, ఎంఆర్‌ఐ శంకరరావు, సూపర్‌వైజర్‌ రవికుమార్‌, పంచాయతీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ భోగిరాజు, బీఎల్వోలు పాల్గొన్నారు.

కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రిన్సిపల్‌ సెక్రటరీ జోషి ఆదేశం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement