ఘనంగా ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట

Jul 5 2026 3:06 AM | Updated on Jul 5 2026 3:06 AM

సాక్షి,పాడేరు: స్థానిక గిరికై లాస క్షేత్రంలోని ఉమా నీలకంఠేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో, పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. గత మూడు రోజుల పాటు విగ్రహానికి ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నిర్ణీత ము హూర్తం ప్రకారం ప్రాణ ప్రతిష్ట ఘట్టం అంగరంగ వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలంనాయుడు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, డాక్టర్‌ నరసింగరావు దంపతులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి వెంకటరత్నం, ప్రధాన అర్చకులు రామం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ వేడుక అనంతరం మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం భారీ అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement