పాడేరు సీఐగా రామారావు బాధ్యతలు స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

పాడేరు సీఐగా రామారావు బాధ్యతలు స్వీకరణ

Jul 5 2026 3:00 AM | Updated on Jul 5 2026 3:00 AM

పాడేరు: పాడేరు సీఐగా ఎస్‌.రామారావు శనివారం ఉదయం తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ సీఐగా పనిచేసిన డి.దీనబంధు విశాఖపట్నం రైల్వే విభాగానికి బదిలీ కావడంతో, శనివారం ఆయన తన విధుల నుంచి రిలీవ్‌ అయ్యా రు. ఆయన స్థానంలో అనకాపల్లి నుంచి పదోన్నతిపై ఎస్‌.రామారావు పాడేరువచ్చారు. బాధ్యతలు చేపట్టడానికి ముందుగా రామారావు స్థానిక మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఐగా బాధ్యతలు స్వీకరించిన రామారావును స్థానిక పోలీస్‌ సిబ్బంది, పలువురు అధికారులు కలిసి అభినందనలు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement