రేషన్‌ బియ్యం మోత తప్పట్లే! | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ బియ్యం మోత తప్పట్లే!

Jul 5 2026 3:00 AM | Updated on Jul 5 2026 3:00 AM

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇంటి వద్దకే వాహనాల ద్వారా నిత్యావసర సరుకులు పొందిన గిరిజనులు, ప్రస్తుత కూటమి పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటింటికీ రేషన్‌’ సౌకర్యాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేయడంతో, గత ఏడాది కాలంగా గిరిజనులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. రేషన్‌ డీలర్ల దుకాణాల (డీఆర్‌ డిపోలు) నుంచి తమ గ్రామాలకు నిత్యావసర సరుకులను మోసుకెళ్లడానికి గిరిజనులు అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా ప్రస్తు తం కురుస్తున్న వర్షాల వల్ల ఈ ఇబ్బందులు మరింతగా పెరిగాయి. జిల్లాలోని 486 రేషన్‌ డిపోల పరిధిలో ఉన్న సుమారు లక్షా 80 వేల మంది తెల్లరేషన్‌ కార్డుదారులు, ప్రతి నెలా బియ్యం బస్తాలను సొంతంగా మోసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. తమకు మళ్లీ ఇంటి వద్దకే రేషన్‌ పంపిణీ చేయాలని గిరిజనులు కోరుతున్నారు. – సాక్షి పాడేరు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement