మన్యం వీరుడా మన్నించు! | - | Sakshi
Sakshi News home page

మన్యం వీరుడా మన్నించు!

Jul 5 2026 3:00 AM | Updated on Jul 5 2026 3:00 AM

● అల్లూరిని మరిచిన అధికారులు ● ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆదేశం

నాతవరం: మన్నించు మన్యం వీరుడా! మండల కేంద్రమైన తహసీల్దార్‌ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి జయంతి సందర్భంగా అధికారులు కనీసం పూలదండ వేయకుండా వదిలేశారు. అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. నాతవరం మండలానికి పక్కనే ఉన్న గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలో గల అల్లూరి పార్కులో విగ్రహం వద్ద స్పీకర్‌, కలెక్టర్‌, ఎస్పీ జిల్లాలో గల ఎమ్మెల్యేలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, జిల్లా అధికారులు అల్లూరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాతవరం తహసీల్దార్‌, పోలీసు కార్యాలయాల ముందున్న అల్లూరి విగ్రహాన్ని కనీసం ఎవరూ పట్టించుకోలేదు. ఈ విగ్రహాన్ని గతంలో ఇక్కడ పని చేసిన తహసీల్దార్‌ ఎస్‌.ఎస్‌ శ్రీనివాస్‌ ఏర్పాటు చేశారు. అంతకు ముందు అల్లూరి జయంతి వర్థంతి వేడుకలు చిత్రపటం ఏర్పాటు చేసి నిర్వహించేవారు. దీనిని గమనించిన అప్పటి తహసీల్దార్‌ అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు అందుబాటులో ఉంటుందని నిర్మించారు. అప్పట్లో ఇక్కడ అధికారులు జయంతి, వర్ధంతి వేడుకలు బాగానే నిర్వహించేవారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఇక్కడకు బదిలీపై వచ్చిన అఽధికారులు అల్లూరి జయంతి వర్థంతి వేడుకలు పూర్తిగా మరిచారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement