ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు మాజీ ఎమ్మెల్యే హితవు
నర్సీపట్నం: శాశ్వతంగా టీడీపీ ప్రభుత్వమే ఉంటుందన్న భ్రమను వీడాలని స్థానిక ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు మాజీ ఎమ్మెల్యే హితువు పలికారు. చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ నాయకుడు నూకరాజును పరామర్శించేందుకు గణేష్ ఏరియా ఆస్పత్రి వెళ్లారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నిర్మించిన అదనపు భవన ప్రారంభోత్సవ శిలాఫలకం కనిపించకుండా ప్లాస్టర్ అతికించి ఉండడాన్ని గణేష్ గమనించి, తానే ప్లాస్టర్ తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రూ.9 కోట్లతో అదనపు భవనాన్ని నిర్మించినట్టు చెప్పారు. భవనం ప్రారంభోత్సవ శిలాఫలకం కనిపించకుండా సూపరింటెండెంట్ సుధాశారద ప్లాస్టర్లు అతికింపజేశారన్నారు. ఆమె తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు పనులు చేయడం మంచిది కాదన్నారు.


