రావికమతం: మండలంలోని దొండపూడిలో మల్టీ పర్పస్ హాల్, పార్క్, ప్రహరీ నిర్మాణం కోసం వీఎంఆర్‌డీఏ చైర్మన్ ఎం.వి. ప్రణవ్‌గోపాల్, చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డా.వేపాడ చిరంజీవిరావు శనివారం భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీఎంఆర్‌డీఏ నిధుల నుంచి సుమారు రూ.93 లక్షలతో ఈ నిర్మాణ పనులు చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు, పార్టీ అధ్యక్షుడు శంకరరావు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాజాన కొండనాయుడు, మండల టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడు వెదురుపర్తి ఆచారి, ఎంపీటీసీ కొప్పాక లక్ష్మినాయుడు, రిజర్వాయర్ చైర్మన్ బంటు రామునాయుడు, పాతాళ చిరంజీవి, కోట నీలవేణీ గోవిందరావు, ఫాల్గుణ పాల్గొన్నారు.


