● కలెక్టర్ నిశాంతి
సాక్షి, పాడేరు: జిల్లాలోని గిరిజన రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ టి.నిశాంతి తెలిపారు. పాడేరులోని యూనియన్ బ్యాంక్ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన రుణమేళాలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు రుణ మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా మొదటి దశలో 29 బ్యాంక్ బ్రాంచీల పరిధిలో 130 రుణమేళాలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. గిరిజన రైతుల వ్యవసాయ పెట్టుబడుల కోసం 7 శాతం వడ్డీకే పంట రుణాలు అందిస్తున్నామని, రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ మాతునాయుడు, పలువురు అధికారులు పాల్గొన్నారు.


