జిల్లాలో 182.8 మిల్లీమీటర్ల వర్షపాతం | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో 182.8 మిల్లీమీటర్ల వర్షపాతం

Jul 4 2026 2:19 AM | Updated on Jul 4 2026 2:19 AM

సాక్షి,పాడేరు: ఏజెన్సీలో గత మూడు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.శుక్రవారం ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది.పాడేరుతో పాటు జిల్లాలోని అన్ని మండలాల్లోను వర్షం సాయంత్రం వరకు కురుస్తూనే ఉంది. పాడేరు,అరకు వారపుసంతలకు వర్షం ఆటంకం కలిగించింది. సంతకు వచ్చిన గిరిజనులతో పాటు చిరు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. పూర్తిస్థాయిలో జనసంచారం లేక సంతలు కళతప్పాయి. జిల్లాలో ముంచంగిపుట్టులో 48.6, పెదబయలులో 36.4, గూడెంకొత్తవీధిలో 20.4, పాడేరులో 14,8, అరకులోయలో 12.6, అనంతగిరిలో 12.2, డుంబ్రిగుడలో 10.4, హుకుంపేటలో 9.4, జి.మాడుగులలో 8.6, చింతపల్లిలో 6.4, కొయ్యూరు 3ఎంఎం చొప్పున జిల్లా వ్యాప్తంగా 182.8 మిల్లీమీటర్ల వర్షపాతం శుక్రవారం నమోదైంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement