● వ్యతిరేకంగా సభ్యుల నిరసన, తీర్మానం
● వాడివేడిగా గూడెంకొత్తవీధి మండల సర్వసభ్య సమావేశం
గూడెంకొత్తవీధి: జిల్లాలోని బాకై ్సట్ నిల్వలను వెలికితీసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని, ప్రైవేటు సంస్థల పేరుతో రహస్యంగా సర్వేలు నిర్వహిస్తున్నారని మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఆరోపించారు. ఇటీవల గూడెంకొత్తవీధి మండలం జర్రెల ప్రాంతంలో కొందరు వ్యక్తులు రహస్యంగా బాకై ్సట్ నమూనాలను తరలిస్తుండగా గిరిజనులు అడ్డుకున్నారని, అధికారుల పరోక్ష సహకారంతోనే ఇవన్నీ జరుగుతున్నాయని వారు మండిపడ్డారు. గురువారం ఎంపీపీ బోయిన కుమారి అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ అంశంపై వాడివేడి చర్చ జరిగింది. తొలుత ఎంపీడీవో రమణబాబు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. అనంతరం గాలికొండ ఎంపీటీసీ సభ్యుడు అంపురంగి బుజ్జిబాబుతో పాటు వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు స్పందిస్తూ, మన్యంలో బాకై ్సట్ తవ్వకాలు చేపట్టవద్దని, రహస్య సర్వేలను నిలిపివేయాలని కోరుతూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఎంపీపీ బోయిన కుమారి స్పందిస్తూ, గిరిజనుల అభీష్టానికి వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మన్యంలో బాకై ్సట్ తవ్వకాలను జరగనివ్వమని స్పష్టం చేశారు. గిరిజనుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని, ఎంపీటీసీ సభ్యుల డిమాండ్ మేరకు తగిన తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా, ప్రస్తుతం మన్యంలో వర్షాలు కురుస్తున్న దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వైద్యాధికారులు గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించాలని సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఆనంద్, ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ కల్యాణ్, ఆర్‌అండ్‌బీ జేఈ భరత్, ఏవో ఇమ్మానుయేల్, ఏపీఓ రాంప్రసాద్, ఎంఈఓ నరసింగరావు, వ్యవసాయాధికారులు సురేష్, గిరిబాబు, వైద్యాధికారి శివరాం తదితర శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


