జోరుగా పశువుల అమ్మకాలు | - | Sakshi
Sakshi News home page

జోరుగా పశువుల అమ్మకాలు

Jul 3 2026 12:34 AM | Updated on Jul 3 2026 12:34 AM

సాక్షి, పాడేరు: ఖరీఫ్‌ వ్యవసాయ సీజన్‌ జోరందుకోవడంతో, పాడేరు మండలం గుత్తులపుట్టు పశువుల సంతలో గురువారం సరికొత్త సందడి నెలకొంది. వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్న గిరిజన రైతులు, తమ పొలాలను దున్నేందుకు అవసరమైన మేలు జాతి పశువుల కోసం సంతకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఒడిశాతో పాటు విజయనగరం, పార్వతీపురం వంటి పొరుగు ప్రాంతాల నుంచి వ్యాపారులు ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్న ఆరోగ్యకరమైన పశువులతో సంత కళకళలాడింది. రైతులకు నచ్చిన జత పశువులను ఎంచుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉండటంతో, అక్కడ గంటల తరబడి బేరసారాలు కొనసాగాయి. పశువుల పరిమాణం, బలిష్టత బట్టి, ఒక జత పశువుల ధర రూ. 30 వేల నుండి రూ. 65 వేల వరకు పలికింది. ఏడాది పొడవునా సాగుకు పునాది వేసే ఈ ఖరీఫ్‌ సీజన్‌ కోసం, రైతులు ఎంతో ఆశగా తమకు నచ్చిన పశువులను కొనుగోలు చేశారు. పశువులను కొనుగోలు చేసిన గిరిజన రైతులు, తమ పంట పొలాల్లో సిరులు పండించాలనే నమ్మకంతో, ఎంతో ఉత్సాహంగా పశువులను తమ గ్రామాలకు తోలుకువెళ్లారు.

గుత్తులపుట్టు సంతలో సందడి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement