ఆకులూరు పాఠశాలకు ఉపాధ్యాయుడి నియామకం | - | Sakshi
Sakshi News home page

ఆకులూరు పాఠశాలకు ఉపాధ్యాయుడి నియామకం

Jul 2 2026 2:35 AM | Updated on Jul 2 2026 2:35 AM

సీలేరు: బడి తెరిచినా రాని బడిపంతులు.. శీర్షికతో సాక్షిలో ప్రచురితమైన కథనానికి జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించారు. సుమారు నెల రోజుల తర్వాత గాలికొండ పంచాయతీ ఆకులూరు పాఠశాలకు బుధవారం ఉపాధ్యాయుని నియమించి, తరగతులను పునఃప్రారంభించారు. ఈ విషయాన్ని గాలికొండ మాజీ సర్పంచ్‌ కాకూరి బుజ్జిబాబు బుధవారం విలేకరులకు తెలిపారు. పాఠశాల తెరిచినప్పటి నుంచి విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఉపాధ్యాయులు లేక విద్యార్థులు విద్యకు దూరమయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లోని సమస్యలను పత్రికలు వెలుగులోకి తీసుకురావడం వల్లనే గిరిజనులకు న్యాయం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement