● ఎమ్మెల్సీ నాగేంద్రబాబు
డుంబ్రిగుడ: మన్యం ప్రకృతి అందాలు భారతదేశానికే తలమానికగా నిలుస్తున్నాయని ఎమ్మెల్సీ నాగేంద్రబాబు అన్నారు. బుధవారం ఆయన మండలంలోని అంజోడ సిల్క్ ఫారమ్, అరకు నర్సరీలను సందర్శించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు, వన సంరక్షణ సమితి సభ్యుల ఆధ్వర్యంలో మొక్కను నాటారు. అనంతరం గిరిజన మహిళలతో ముచ్చటించి, వారి థింసా నృత్యంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమంతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. స్థానిక గిరిజనులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా, ఎకో టూరిజం అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అటవీ శాఖ అధికారులు, స్థానిక గిరిజనులు పాల్గొన్నారు.


