గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి | - | Sakshi
Sakshi News home page

గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి

Jul 1 2026 1:52 AM | Updated on Jul 1 2026 1:52 AM

సాక్షి,పాడేరు: జిల్లాలో అన్ని ఇంజనీరింగ్‌ శాఖల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల నిర్మాణాలను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ టి.నిశాంతి ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాలో అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పీఎం జన్‌మన్‌, డీఏ జూగా, ఎన్‌హెచ్‌ఎం, సీసీడీపీ నిధుల కింద మంజూరై, నిర్మాణదశలో ఉన్న పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఈ విషయంలో అలసత్వం వహించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.అంగన్‌వాడీ భవనాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గర్భిణి రక్షణ, ఆరోగ్య సంరక్షణ కేంద్రాల పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అన్ని అభివృద్ధి పనులు నాణ్యంగా జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, గిరిజన సంక్షేమశాఖ పాడేరు ఈఈలు డేవిడ్‌రాజ్‌, పంచాయతీరాజ్‌ ఈఈ కొండయ్యపడాల్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ నాగేశ్వరరావు, ఆర్‌అండ్‌బీ ఈఈ సాగర్‌, ఇరిగేషన్‌ ఈఈ రాజేశ్వరరావు, హౌసింగ్‌ ఈఈ బాబునాయక్‌ పాల్గొన్నారు.

కలెక్టర్‌ నిశాంతి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement