● పెరుగుతున్న జ్వరపీడితుల సంఖ్య
ముంచంగిపుట్టు: వాతావరణ మార్పులు, కురుస్తున్న వర్షాల కారణంగా గిరిజన గ్రామాల్లో జ్వరపీడితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరిగింది. మంగళవారం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి (సీహెచ్‌సీ) టైఫాయిడ్, మలేరియా, వైరల్ జ్వరాలతో బాధపడుతున్న రోగులు పెద్ద సంఖ్యలో చికిత్స కోసం వచ్చారు. ఆసుపత్రిలో కేవలం 30 పడకలు మాత్రమే ఉండటంతో వైద్యులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వార్డులు రోగులతో నిండిపోవడంతో, గత్యంతరం లేక ఒకే బెడ్‌పై ఇద్దరు రోగులను ఉంచి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు, సిబ్బంది కొరత కారణంగా రోగులు వైద్య సేవల కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికై నా ఈ సీహెచ్‌సీని 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని, ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పో స్టులను భర్తీ చేయాలని రోగులు కోరుతున్నారు.


