● 108 అంబులెన్సులో సుఖప్రసవం
జి.మాడుగుల: మండలంలోని పెద్దలోచల్లి పంచాయతీకి చెందిన కిల్లో దేవకి అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో, కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం జి.మాడుగుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆమె పరిస్థితి విషమంగా ఉందని (హైరిస్క్) గమనించిన వైద్యులు, మెరుగైన వైద్యం కోసం పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. వైద్యుల సలహా మేరకు 108 అంబులెన్స్‌లో పాడేరుకు తరలిస్తుండగా, మార్గమధ్యంలోని కె.కోడాపల్లి సమీపంలో ఆమెకు నొప్పులు తీవ్రమయ్యాయి. వెంటనే స్పందించిన ఈఎంటీ రామకృష్ణ, పైలట్ పవన్‌కుమార్ అంబులెన్స్‌ను రోడ్డు పక్కన నిలిపివేసి, అత్యవసర వైద్య సేవలు అందించి సురక్షితంగా ప్రసవం చేయించారు. దేవకి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబ్డి ఆరోగ్యంగా ఉండటంతో కుటుంబ సభ్యులు 108 సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


