● కలెక్టర్ నిశాంతి
సాక్షి,పాడేరు: జిల్లాలోని రైతుల సమస్యలు పరిష్కారం లక్ష్యంగా ఈనెల ఒకటోతేదీ బుధవారం ప్రత్యేక పీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ టి.నిశాంతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాడేరు కలెక్టరేట్‌లో ఉదయం 11 గంటలకు రైతుల ప్రత్యేక పీజీఆర్‌ఎస్ ప్రారంభమవుతుందన్నారు. వ్యవసాయ, అనుబంధ విభాగాల హెచ్‌వోడీలు, అన్నిశాఖల జిల్లా అధికారులు తమ డివిజన్, మండల స్థాయి అధికారులతో కలిసి తప్పనిసరిగా హాజరుకావాలని ఆమె ఆదేశించారు. జిల్లాలోని రైతులంతా పీజీఆర్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.


