చలో కలెక్టరేట్‌ విజయవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

చలో కలెక్టరేట్‌ విజయవంతం చేయండి

Jun 30 2026 12:19 AM | Updated on Jun 30 2026 12:19 AM

మాట్లాడుతున్న చిన్నయ్యపడాల్‌

పాడేరు రూరల్‌: వచ్చేనెల 30,31తేదీల్లో నిర్వహించనున్న చలో కలెక్టరేట్‌ను విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు బోనంగి చిన్నయ్యపడాల్‌ కోరారు. పాడేరు సీఐటీయూ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాఫీ,ఫారెస్టు,ఐటీడీఏలలో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది,అంగన్‌వాడీ,ఆశ వర్కర్లు సీహెచ్‌డబ్ల్యూ ఉద్యోగులు, వెలు గు వీఏవోలు, గ్రామ రెవెన్యూ సహాయకులు, కేజీబీవీల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలని, లేకపోతే ఉద్యమిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు,సహాయ కార్యదర్శి సుందరరావు,మొస్య,వెంకటగిరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement