సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు
అనకాపల్లి: దేవరాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గరిశింగి సచివాలయంలో ఏఎన్‌ఎంగా విధులు నిర్వహిస్తున్న జి.రాజ్యలక్ష్మిని వేధింపులకు గురిచేసి, ఆమె ఆత్మహత్యాయత్నం చేయడానికి కారణమైన హెల్త్ సూపర్ వైజర్ పుష్పరాజును అరెస్టు చేయాలని ఏపీ యునైటెడ్ గ్రామ, వార్డు హెల్త్ సెక్రటరీస్ అసోసియేషన్ సభ్యులు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశా రు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడారు. ఏఎన్‌ఎం రాజ్యలక్ష్మిని వేధింపులకు గురిచేయడంతో పాటు హెల్త్ సెక్రటరీలపై కూడా పుష్పరాజు దురుసుగా ప్రవర్తించాడని తెలిపారు.ఆత్మహత్యకు యత్నించిన రాజ్యలక్ష్మి పాడేరు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందన్నారు. దీనికి కారణమైన పుష్ప రాజు సస్పెండ్ చేసి, అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తు న ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.


