● సింహగిరిపై ముగిసిన అప్పన్న వార్షిక కల్యాణ మహోత్సవాలు
సింహాచలం: సింహగిరిపై వారం రోజులుగా జరుగుతున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణమహోత్సవాలు శుక్రవారం రాత్రితో ఘనంగా ముగిశాయి. కల్యాణోత్సవాల ముగింపు పురస్కంచుకుని సాయంత్రం నుంచి స్వామికి శ్రీ పుష్పయాగం విశేషంగా నిర్వహించారు. కల్యాణ ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు పూల అంకరణ చేసి ఆలయ కల్యాణమండపంలో శేషతల్పంపై ఆళ్వారులతో సహా వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం జరిపారు. ద్వాదశి ఆరాధనలతో, పలు రకాల పుష్పాలతో పుష్పాంజలి సేవ చేశారు. విశేష హారతులు అందించారు. అనంతరం భోగమండపంలో ఊంజల్ సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అశేషంగా కార్యక్రమాల్లో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, సీతారామాచార్యులు, అర్చకులు ఈ సేవను నిర్వహించారు. దేవస్థానం ఈవో జె.వెంకటరావు దంపతులు పాల్గొన్నారు.


