తేగాడ కేజీబీవీలో కేంద్ర బృందం | - | Sakshi
Sakshi News home page

తేగాడ కేజీబీవీలో కేంద్ర బృందం

Apr 3 2026 7:26 AM | Updated on Apr 3 2026 7:26 AM

తేగాడలోని కస్తూర్భాగాంధీ విద్యాలయంలో పరిశీలిస్తున్న కేంద్ర అధ్యయన బృందం

కశింకోట : మండలంలోని తేగాడ వద్ద ఉన్న కస్తూర్భాగాంధీ విద్యాలయాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి రొనాల్డ్‌ రోజ్‌ బృందం గురువారం సందర్శించింది. ఈ సందర్భంగా వ్యర్థాలను అరికట్టడానికి ప్రయోగాత్మకంగా జిల్లాలోని వసతి గృహాలు, కస్తూర్భాగాంధీ విద్యా సంస్థలతోపాటు ఇక్కడ కూడా ఏర్పాటు చేసిన కంపోస్టు ఎరువు తయారీ, వర్షం నీరు, వాడుక నీరు నివారణ కోసం నిర్మించిన ఇంకుడు గొయ్యి, కూరగాయలు పండించేందుకు ఏర్పాటు చేసిన కిచెన్‌ గార్డెన్‌లను బృందం పరిశీలించింది. వాటి నిర్వహణ తీరును అధ్యయనం చేసి సంతృప్తి వ్యక్తం చేసింది. విద్యార్థులతో ఈ కార్యక్రమం అమలుపై ఉన్న అవగాహన గురించి బృందం చర్చించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించింది. ఈ సందర్భంగా రోనాల్డ్‌ రోజ్‌ కస్తూర్భా విద్యా సంస్థ ఆవరణలో మొక్కలు నాటారు. బృందంలో ఏపీ ప్రిన్సిపల్‌ కార్యదర్శి రొనాల్డ్‌ రోజ్‌ , డీఈవో అప్పారావునాయుడు, ఎంఈవోలు సురేష్‌కుమార్‌, రమణశ్రీ, ఎంపీడీవో సిహెచ్‌.చంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement