పాడేరు : ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, గిరిజనుల ఇలవేల్పు పాడేరు మోదకొండమ్మ తల్లి జాతర ఉత్సవాలను ఈ ఏడాది మే 10, 11, 12 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పాడేరు ఎమ్మెల్యే, మోదకొండమ్మ తల్లి ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు తెలిపారు. స్థానిక అమ్మవారి ఆలయం అన్నదాన సత్రంలో ఉత్సవ కమిటీ, ఆలయ కమిటీ సభ్యులతో ఆయన బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ గత ఏడాది కన్నా గొప్పగా ఉత్సవాల నిర్వాహణకు కార్యచరణ రూపొందించామన్నారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గిరిజన ప్రాంతంలోని అన్ని వర్గాల భక్తులు ఉత్సవాల నిర్వాహణ కోసం విరివిగా విరాళాలు ఇచ్చి సహకరించాలన్నారు. ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబు నాయుడు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు పలాసి కృష్ణారావు, కిల్లు గంగన్న పడాల్, కుడుముల వెంకటరమణ, మాసాడ ఈశ్వరరావు, వర్తన పిన్నయ్య దొర, బోనంగి వెంకటరమణ, డి.పి. రాంబాబు, టి.ప్రసాద్‌నాయుడు పాల్గొనారు.
పాడేరు ఎమ్మెల్యే, మోదకొండమ్మ తల్లి ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు


