తోటాడలో అగ్ని ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

తోటాడలో అగ్ని ప్రమాదం

Mar 23 2026 8:26 AM | Updated on Mar 23 2026 8:26 AM

చికెన్‌ సెంటర్‌లో మంటలు

మునగపాక: మండలంలోని తోటాడలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో చికెన్‌ షాపు దగ్ధమైంది. తోటాడ సెంటర్‌లో అనపర్తి లోవరాజు చికెన్‌ షాపు నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. షాపులోని గ్యాస్‌ సిలిండల్‌ లీక్‌ కావడంతో మంటలు చెలరేగి షాపు కాలిపోయింది. ఈ ప్రమాదంలో విధ్యుత్‌ మీటర్‌తో పాటు కాటా, 20 కోళ్లు ఆగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో రూ.30వేల ఆస్తినష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement