న్యాయవాద వృత్తి పూలబాట కాదు | - | Sakshi
Sakshi News home page

న్యాయవాద వృత్తి పూలబాట కాదు

Mar 23 2026 8:26 AM | Updated on Mar 23 2026 8:26 AM

విశాఖ లీగల్‌ : సమాజంలో న్యాయవాద వృత్తి అత్యంత కీలకమైందని, అయితే ఇది పూలబాట కాదని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం జిల్లా కోర్టు ఆవరణలో విశాఖ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా, సాంస్కృతిక ఉత్సవాల ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయవాద వృత్తిలో రాణించాలంటే నిరంతర శ్రమ, అంకితభావం తప్ప వేరే మార్గం లేదని, అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే విజయం సొంతమవుతుందని పేర్కొన్నారు. మరో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి మాట్లాడుతూ.. నిరంతర అధ్యయనం ద్వారానే వృత్తిలో ఎదగడం సాధ్యమని తెలిపారు. నిత్యం కేసులతో బిజీగా ఉండే న్యాయమూర్తులు, న్యాయవాదులకు ఇటువంటి క్రీడా కార్యక్రమాలు మంచి ఆటవిడుపును ఇస్తాయని, మానసిక ఉల్లాసానికి ఇవి ఎంతో అవసరమని చెప్పారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు న్యాయమూర్తులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె. శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి లాలం పార్వతి నాయుడు, క్రీడా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి

జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement